Homeసినిమానితిన్ సినిమాలో నభా..!

నితిన్ సినిమాలో నభా..!

‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో భారీ హిట్లు కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా మరో సినిమా వస్తోంది. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ నభా నటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర సెకండాఫ్​లో వస్తోందని తెలుస్తోంది. నభా నటేశ్ కోసం ఓ స్పెషల్ సాంగ్​ను కూడా వెంకీ కుడుముల డిజైన్ చేశాడట. కాగా, ‘ఛలో ‘భీష్మ సినిమాలోని ఫన్ కంటే ఈ సినిమాలో ఫన్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్​టైన్​గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించబోతుంది. భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ కుడుముల – నితిన్ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. ఈ హిట్ కాంబినేషన్ ఏ రేంజ్​లో అలరిస్తోందో చూడాలి.

Recent

- Advertisment -spot_img