Homeహైదరాబాద్latest Newsపవన్ టైటిల్ తో నితిన్.. ఫస్ట్ లుక్ రిలీజ్

పవన్ టైటిల్ తో నితిన్.. ఫస్ట్ లుక్ రిలీజ్

టాలెంటెడ్ హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘తమ్ముడు’ మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లోగో, పోస్టర్ చూస్తుంటే చాలా క్రియేటివ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్పెషల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్నీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి యూనిక్‌గా రూపొందుతోంది.

ఈ ఫస్ట్ లుక్ లో నితిన్ లుక్ చాలా కొత్తగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తున్నారు.

గత చిత్రాలకు భిన్నంగా నితిన్ ఈ చిత్రంతో మెప్పించబోతున్నారని తెలుస్తుంది. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ వేణు రొటీన్‌కు భిన్నంగా ఎంటర్‌టైనర్‌తో మెప్పించనున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాపర్‌గా వర్క్ చేస్తున్నారు. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img