ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో నితీశ్ కుమార్ సెంచరీతో సత్తా చాటాడు. టెస్టుల్లో అతనికి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. 171 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 103 పరుగులు చేశాడు. నితీశ్ తన అద్భుతమైన ఆటతీరుతో భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి బయటపడేశాడు. భారత్ 9 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. ఇంకా 120 పరుగులు వెనుకబడి ఉంది.