Homeసినిమాతెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’​ బుక్సింగ్స్​పై నో క్లారిటీ..

తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’​ బుక్సింగ్స్​పై నో క్లారిటీ..

ఇండియా వైడ్​గా మూవీ లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ ‘సలార్’. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వారం రోజుల్లో రిలీజ్​ కానుంది. రీసెంట్​గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్​కు మంచి అప్లాజ్​ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, రెండ్రోజుల కిందట మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ‘సూరీడే’పాటు ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది. ఫ్రెండ్ షిప్​ నేపథ్యంలో సాగే ఈ సాంగ్​లో లిరిక్స్​తో పాటు మ్యూజిక్​ సైతం అందరినీ ఎమోషనల్​ చేసేసింది. అయితే, మరో వారం రోజులో సినిమా రిలీజ్ ఉండటంతో అడ్వాన్స్​ బుకింగ్స్​పై ప్రస్తుతం హంగామా నడుస్తోంది. కర్ణాటకలో బుకింగ్స్ శుక్రవారం ఓపెన్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పడనేది ఇంకా క్లారిటీ లేదు. నార్త్ ఇండియా, తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పై మున్ముందు క్లారిటీ రానుంది.

Recent

- Advertisment -spot_img