ఇదే నిజం రామగిరి : ఈరోజు ముత్తారం మండల సహకార సంఘం బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్‌లపై కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ రమణారెడ్డిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు సబ్ రిజిస్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అవిశ్వాసం నెగ్గించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.