No employment chances in telangana state : రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక, యువకులకు ఉపాధి అవకాశాలు దొరకక బతుకుదెరువు లేకుండా పోయిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
2013-14లో రాష్ట్రంలో రెండు శాతం నిరుద్యోగం ఉంటే 2019-19 నిరుద్యోగ శాతం 8కి చేరిందన్నారు.
వాస్తవంగా తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 60 వేల ఖాళీలను మాత్రమే ప్రభుత్వం చూపిస్తుందని కోదండరాం మండిపడ్డారు.