ఇప్పటి వరకు ఇన్ని సక్సెస్‌లు సాధించినా ఇప్పటికీ యావరేజ్ నటినే అని నటి సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి సమంత.. ‘‘నేను ఇప్పటికీ యావరేజ్ నటినే.. ఇంకా నటనలో పరిణితి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను.. నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు అందుకున్నా ఇవన్నీ అందరి కృషి వల్లనే సాధ్యం అయింది సమంత తెలిపింది. ఒక సినిమా వెనుక చాలా మంది నిపుణుల కృషి ఉంటుంది. ఒక సినిమాకు నా దగ్గర టాలెంటెడ్ క్రూ ఉంటేనే మన టాలెంట్ బయటకు వస్తుంది. నేను ప్రతిభావంతులైన సిబ్బంది మరియు నటీనటులు మరియు సాంకేతిక నిపుణులతో పనిచేశాను. ఇది నా అదృష్టం అని సమంత పేర్కొంది. నాగచైతన్యతో పెళ్లి బ్రేకప్ అయిన తర్వాత కూడా నటి సమంతకు అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. సమంత కమ్‌బ్యాక్ హిట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో, సమంతా తాజాగా నటించిన ‘హనీ బన్నీ’వెబ్ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నరు.