Homeహైదరాబాద్latest Newsఎంతమంది'పుష్ప-2'పై దుష్ప్రచారం చేసినా.. సినిమాని చూడకుండా ఎవరు ఆపలేరు : మాజీ మంత్రి అంబటి రాంబాబు

ఎంతమంది’పుష్ప-2’పై దుష్ప్రచారం చేసినా.. సినిమాని చూడకుండా ఎవరు ఆపలేరు : మాజీ మంత్రి అంబటి రాంబాబు

అల్లు అర్జున్ గారి ‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసిన ఆ సినిమాని చూడకుండా ఎవ్వడు ఆపలేరు అని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయంపై అంబటి రాంబాబు మాట్లాడతూ.. అక్కడ దాకా ఎందుకయ్యా నందమూరి తారకరామారావు గారి కుటుంబం నుండి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేసారు ? ఆపగలిగారా ? అని అంబటి రాంబాబు అన్నారు. అట్లాగే ఇప్పుడు అల్లుఅర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే.. ప్రజలు సినిమా బాగుంటే ఎవరైనా చూస్తరు..బాగోపోతే చూడరు అని అన్నారు. అరే రాజబాబు హీరో గా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామండి మేము సినిమా బాగుంటే.. ఎన్ టి రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం.. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు అదే విధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు. నాకు తెలిసి జనాలు అందరూ ఉవ్విల్ ఊరుతున్నారు ‘పుష్ప 2’ చూద్దాం అని.ఈ సినిమా అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. నేను కూడా ‘పుష్ప 2’ ఎలా ఉంటదో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా ‘పుష్ప పార్ట్ వన్’ అద్భుతంగా ఉంది కదా.. హాలీవుడ్ స్టైల్ లో ఉంది కదా అందువల్ల అల్లుఅర్జును చూసి కొంతమందికి బాగా జలసి గా ఉంది..
మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తు పెట్టుకోండి అని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యల చేసారు.

Recent

- Advertisment -spot_img