రాష్ట్రంలో ఇకపై రౌడీయిజం చేస్తామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. అల్లరి మూకలను, తీవ్రవాదులను అణిచివేసిన చరిత్ర తనకు ఉందని గుర్తు చేశారు. మంచిని ప్రోత్సహించి, చెడును తుంగలో తొక్కుతానని తెలిపారు. నేరాలు చేసి తప్పించుకుంటామని అనుకుంటే జరగదని చెప్పారు. గత పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.