ఏపీలో నేతల స్నాక్స్ ఖర్చులపై వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, వైసీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు పోటాపోటీగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాయి. 2019-24 వరకు వైసీపీ నేతల ఎగ్పఫ్ల ఖర్చు రూ.3.62 కోట్లుగా టీడీపీ పేర్కొంది. దీనికి కౌంటర్గా 2014-19 వరకు టీడీపీ హయాంలో స్నాక్స్ ఖర్చు రూ.8.50 కోట్లని వైసీపీ పేర్కొంది. ఈ స్నాక్స్ వ్యవహారం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.