Homeహైదరాబాద్latest Newsఎవ్వర్నీ వదిలిపెట్టం.. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా సరే.. కూల్చివేతలు తప్పవు: సీఎం రేవంత్

ఎవ్వర్నీ వదిలిపెట్టం.. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా సరే.. కూల్చివేతలు తప్పవు: సీఎం రేవంత్

  • ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా సరే
  • చెరువుల్ని చెరబడితే ఊరుకోసం
  • భగవద్గీత స్ఫూర్తిగానే కూల్చివేతలు
  • అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదు
  • శ్రీమంతులు చెరువులు ఆక్రమించారు
  • అందుకే వారి నిర్మాణాలు కూల్చేస్తున్నాం
  • ప్రకృతిని ధ్వంసం చేస్తే మూల్యం చెల్లించుకుంటాం
  • చైన్నై వరదలు, వయనాడు విలయమే నిదర్శనం
  • గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి వ్యర్థ్యాలు వదులుతున్నారు
  • రాజకీయ కక్ష కోసం ఈ కార్యక్రమం చేయడం లేదు
  • భవిష్యత్ తరాలు బాగుండాలన్నదే మా లక్ష్యం
  • సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్వహిస్తున్న.. అనంత శేష స్థాపనలో ముఖ్యమంత్రి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: భగవద్గీతో కృష్ణుడి బోధనల స్ఫూర్తిగానే తాము కూల్చివేతలు కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ధర్మం గెలవాలంటే అధర్మం మీద యుద్ధం చేయక తప్పదన్నారు. చెరువులను చెరబడితే ఎంతపెద్ద వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉన్నవారైనా సరే తాము ఉపేక్షించబోమున్నారు. హైడ్రా కూల్చివేత్తలపై ముఖ్యమంత్రి స్పందించారు. హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్వహిస్తున్న అనంత శేష స్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో గతంలో ఎన్నో చెరువులు ఉండేవని అన్నారు. చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి విముక్తి చేయాలనుకున్నామని.. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని చెప్పారు. కొంత మంది శ్రీమంతులు చెరువులు ఆక్రమించి భవనాలు కట్టుకున్నారని అన్నారు. వారి కారణంగా హైదరాబాద్ లో జనజీవనానికి ఇబ్బంది కలుగుతోందని చెప్పారు.

చెరువులే మనకు ఆధారం
నగరంలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుందని అన్నారు. గతంలో చెన్నైలో వచ్చిన వరదలు.. వయనాడ్ లో విలయాలు అందుకు నిదర్శనం అని అన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చని.. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు కట్టించుకున్న శ్రీమంతుల ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారని అన్నారు. చెరువులు మన జీవనాధారం, సంస్కృతి అని.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు.

జీవితంలోనే అరుదైన ఛాన్స్
‘జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నా జన్మ సుకృతం.. కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయం. ఈ టవర్ 430 అడుగుల ఎత్తు నిర్మితం కావడం రాష్ట్రానికి గర్వకారణం. 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మాణం పూర్తి అవుతుంది.. అది మళ్లీ మనమే ప్రారంభించుకుంటాం’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img