Homeతెలంగాణకేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు.. నేను కచ్చితంగా ప్రధాని రేసులో ఉంటా: కేసీఆర్

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదు.. నేను కచ్చితంగా ప్రధాని రేసులో ఉంటా: కేసీఆర్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తాను కచ్చితంగా ప్రధాని రేసులో ఉంటానని మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని చెప్పారు. అవకాశం వస్తే తాను వంద శాతం రేసులో ఉంటానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలన మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆగ్రహంగా ఉన్నారన్నారు. దాదాపుగా 26 నుంచి 33 మంది తమతో టచ్​ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​ ను రెండో రాజధాని చేసే కుట్ర నడుస్తోందని ఆరోపించారు. అలా చేస్తే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. వ‌చ్చే సెష‌న్‌లో కేసీఆర్ ప్ర‌ళ‌య గ‌ర్జ‌న చూస్త‌రు అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ‘ఒక రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీ దొడ్లే ఎంత మంది ఉంటారో చూడు అని అన్నారు. ఏం కాలేదు. ఇది కూడా అంతే ఉంది. ఈయ‌న‌నే బీజేపీలోకి జంపు కొడుతురాని కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయ‌న త‌ప్పించుకోలేరు. కాబ‌ట్టి కింద‌మీద అయితే కేసులు త‌ప్పించుకునేందుకు బీజేపీలోకి వెళ్తాడ‌ని అనుకుంటున్నారు. మా పార్టీలోకే కాంగ్రెసోళ్లు రాబోతున్నారు. న‌న్ను ఎవ‌రూ డైరెక్ట్ అడ‌గ‌లేదు. మా పార్టీలో ఉన్న ముఖ్యుల‌ను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులు క‌న్స‌ల్ట్ అవుతున్నారు. 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలం రెడీగా ఉన్నాం. ఇద్ద‌రం క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. ఏం జ‌ర‌గ‌బోతదో చూద్దాం అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్‌గానే ఉంట‌ది. పెద్ద‌ప‌ల్లితో పాటు మిగ‌తా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాదిగ సామాజిక ఆగ్ర‌హంగా ఉన్నారు. పెద్ద‌ప‌ల్లిలో కాంగ్రెస్ అభ్య‌ర్థిని ఓడించి చూపెడుతామ‌న్నారు. ఆ ఆగ్ర‌హానికి కాంగ్రెస్ బ‌లి అవుత‌ది. జిల్లాలు తీసేస్తామంటే యుద్ధానికి సిద్ధ‌మ‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. ఇది కూడా కాంగ్రెస్‌కు ఎఫెక్ట్ అవుతోంది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వస్తుందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. లిక్క‌ర్ స్కాం అనేది మోడీ సృష్టించిన‌ రాజ‌కీయ కుంభ‌కోణమని చెప్పారు. తాను అర్వింద్​ కేజ్రీవాల్ కంట్లో నలుసులా మారామనే ఈ కేసును తెరమీదకు తెచ్చారని చెప్పారు.
నా గుండెల్లో తెలంగాణ ఉంట‌ది..
తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో కేసీఆర్ ఉంట‌డు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. గెలుపోట‌ములు ప‌క్క‌న పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోష‌న్ ఆఫ్ తెలంగాణ. వంద శాతం కేసీఆర్‌కు ఆ బాండేజ్ ఉంట‌దని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ‘కేసీఆర్ తెలంగాణ‌కు ఉన్న బంధం అది. దిక్కు దివానా లేన‌ప్పుడు నా ప‌ద‌వులు నా రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఫ‌ణంగా పెట్టినా తెలంగాణ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డానో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంట‌ది.. తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో కేసీఆర్ ఉంట‌డు. గెలుపోట‌ములు ప‌క్క‌న పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ఎమోష‌న్ ఆఫ్ తెలంగాణ. వంద శాతం కేసీఆర్‌కు ఆ బాండేజ్ ఉంట‌ది. కేసీఆర్‌ను గిల్లి ప‌డేస్తాం అనుకుంటే వాడు పిచ్చోడు అయిత‌డు త‌ప్ప తెలంగాణ ప్ర‌జ‌లు కారు’ అని కేసీఆర్ తేల్చిచెప్పారు.

Recent

- Advertisment -spot_img