Homeజిల్లా వార్తలు"ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు.. మట్టి వినాయక విగ్రహాలే ముద్దు" నినాదాలతో .. పాఠశాల విద్యార్థులు...

“ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు.. మట్టి వినాయక విగ్రహాలే ముద్దు” నినాదాలతో .. పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ..!

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలు పూజించాలని ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు.. మట్టి వినాయక విగ్రహాలు ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ పాఠశాల నుండి రాజీవ్ గాంధీ విగ్రహం నుండి తెలంగాణ తల్లి చౌరస్తా నుండి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. మట్టి వినాయకుడి ప్రతిమలు ప్రకృతికి ప్రతిరూపాలు, మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. చవతి పండుగను.. ప్రజలు, రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని విద్యార్థులు అన్నారు . ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణ నీటి కాలుష్యం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నరేష్, ప్రధానోపాధ్యాయులు మంజుల, పద్మ, భాను, అపర్ణ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img