Homeహైదరాబాద్latest Newsమోడీకి రిటైర్​ మెంట్​ లేదు.. రీప్లేస్​ మెంట్ లేదు.. బీజేపీ రాజ్యాంగంలో అటువంటి రూల్​ ఏమీ...

మోడీకి రిటైర్​ మెంట్​ లేదు.. రీప్లేస్​ మెంట్ లేదు.. బీజేపీ రాజ్యాంగంలో అటువంటి రూల్​ ఏమీ లేదు: అమిత్​ షా

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఏడాది సెప్టెంబర్​ 17 నాటికి 75 ఏండ్లు పూర్తి చేసుకుంటారు కాబట్టి బీజేపీలో ఉన్న నిబంధన ప్రకారం ఆయన రిటైర్​ అవుతారని.. రానున్న రోజుల్లో అమిత్​ షా ప్రధాని అవుతారని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లకు కేంద్రహోంమంత్రి అమిత్​ షా స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు. మోడీకి రిటైర్​ మెంట్​ లేదు రీప్లేస్​ మెంట్ లేదు అంటూ కౌంటర్​ ఇచ్చారు. ప్రధాని మోడీ పక్కకు తప్పుకుంటారని కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని షా అన్నారు. బీజేపీ రాజ్యాంగంలో అటువంటి రూల్​ (75 ఏళ్ల పరిమితి) ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఐదేండ్లు మోడీయే పూర్తి కాలం అధికారంలో ఉంటారని చెప్పారు. ఈ విషయంలో ఇండియా కూటమి నేతలకు ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై వచ్చాడని, తన అరెస్టు అక్రమం అంటూ సుప్రీంకోర్టు ముందు చెప్పినా కూడా ఉపశమనం లభించలేదని, మధ్యంతర బెయిల్ జూన్ 1 వరకు మాత్రమే ఇవ్వబడిందని, ఆ తర్వాత ఆయన లొంగిపోవాలని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ దీనిని క్లీన్‌చిట్‌గా భావిస్తే, చట్టంపై కేజ్రీవాల్​ కు అసలు అవగాహనే లేదని చెప్పారు. బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని, మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని ఇండియా కూటమి నేతలకు బాగా తెలుసున్నారు. అందుకే నోటికొచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.

Recent

- Advertisment -spot_img