Anantapur : పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధిస్తోందని అనంతపురం పట్టణానికి చెందిన కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులందరూ పస్తులుంటున్నారని వాపోయారు. వెట్టిచాకిరి చేయించుకొని జీతాలా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉగాది పండగ ఉన్నా జరుపుకోవడానికి డబ్బుల్లేక ఇలా రోడ్డుపై ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు.