Homeహైదరాబాద్latest News‘మేడారం’ ఉత్సవ కమిటీలో గిరిజనేతరులా?

‘మేడారం’ ఉత్సవ కమిటీలో గిరిజనేతరులా?

– ఇది ఆదివాసి సంస్కృతికి విరుద్ధం
– ఆదివాసీ సేన మండల కార్యదర్శ ఆలం శ్రీను

ఇదేనిజం ములుగు ప్రతినిధి: మేడారం ఉత్సవ కమిటీలో గిరిజనేతరులను నియమించడం ఆదివాసి సంస్కృతికి విరుద్ధమని ఆదివాసి సేన సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండల కార్యదర్శ ఆలం శ్రీను ఆరోపించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరలో పూర్తి స్థాయి జాతర ట్రస్ట్ బోర్డ్ వేయకుండా తాత్కాలిక ఉత్సవ కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. బుధవారం ఆయన ములుగులో మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరను, ట్రస్ట్ బోర్డ్ ను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మంకిడి శ్రీను, పిరీల భాస్కర్, పిరీల రాజు, కొరం శేఖర్, పా మహేందర్, పొడెం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img