Homeహైదరాబాద్latest NewsNorth Korea : విడాకులు తీసుకుంటే కఠిన శిక్ష.. ఉత్తర కొరియా కొత్త చట్టం..!

North Korea : విడాకులు తీసుకుంటే కఠిన శిక్ష.. ఉత్తర కొరియా కొత్త చట్టం..!

North Korea : దేశంలో విడాకులు తీసుకుంటే కఠిన శిక్ష విధిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ తెలిపారు. ప్రపంచంలో చాలా వరకు విడాకులను అంగీకరిస్తున్నప్పటికీ, ఉత్తర కొరియా (North Korea) మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకించే కొన్ని దేశాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఇప్పుడు, ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది, దేశంలో వివాహాలను రద్దు చేసుకోవాలనుకునే వారికి కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టింది. విడాకులు తీసుకునే జంటలు ఇప్పుడు తమ చర్యలకు ‘ప్రాయశ్చిత్తం’గా జైలు శిక్ష లేదా ఆరు నెలల లేబర్ క్యాంపుల్లో ఉండటం వంటి కఠినమైన శిక్షలను ఎదుర్కొంటారు అని అధ్యక్షుడు తెలిపాడు. కరోనా కాలం తర్వాత ఉత్తర కొరియాలో విడాకులు పెరుగుతున్నాయి. దీన్ని అడ్డుకునేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు దేశ వర్గాలు చెబుతున్నాయి.

Recent

- Advertisment -spot_img