North Korea : దక్షిణ కొరియాకు కిమ్ చెల్లెలు సీరియస్ వార్నింగ్
North Korea : ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా అన్నకు తగ్గ చెల్లెలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా ఆమె తమ పొరుగుదేశం దక్షిణ కొరియాకు ఘాటు హెచ్చరికలు చేశారు.
ముందస్తు దాడులకు దిగితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, దక్షిణ కొరియాలోని కీలక లక్ష్యాలను క్షణాల్లో పేల్చివేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కిమ్ సోదరికి ఇంత కోపం రావడానికి దక్షిణ కొరియా రక్షణ మంత్రి సు వూక్ చేసిన వ్యాఖ్యలే కారణం.
Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?
తమ దేశం అమ్ములపొదిలో అనేక క్షిపణులు ఉన్నాయని, ఉత్తర కొరియాలో ఏ మూలకైనా అవి వెళతాయని సు వూక్ అన్నారు.
పైగా, వాటి గురితప్పే ప్రశ్నే లేదని తెలిపారు. దక్షిణ కొరియా మంత్రి వ్యాఖ్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని కిమ్ యో జోంగ్ మండిపడుతున్నారు.
దక్షిణ కొరియా సాహసాలు చేయాలన్న ఆలోచన కట్టిపెడితే మంచిదని స్పష్టం చేశారు.
ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీస్తాయని హితవు పలికారు.
ఏదేమైనా ఇలాంటి ప్రకటనలు చేసేముందు ఓసారి ఆలోచించుకోవాలన్నారు.
Apple : రోజుకో ఆపిల్‌తో జీర్ణ సమస్యలకు చెక్
Vizag Airport : విశాఖపట్నం విమానాశ్రయంని ఎందుకు VTZ అంటారు? ఎందుకు VSKP అన్నారు?