ప్యాంగ్‌యాంగ్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఉత్తరకొరియా అత్యంత తీవ్రమైన చర్యలకు పూనుకుంది. చైనా నుంచి దేశంలోకి వచ్చే వారిలో కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే వారిని షూట్ చేసే విధంగా అక్కడి సైనికాధికారులకు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ‘షూట్-టు-కిల్’ ఆర్డర్స్ ఇచ్చినట్లు దక్షిణ కొరియాలో యూఎస్ బలగాలకు కమాండర్‌గా ఉన్న రాబర్ట్ అబ్రహాం ఓ సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు అయినట్లు ప్రకటించలేదు. ఇటీవల టైఫూన్ మేసక్ తుఫాను కారణంగా ఆ దేశంలో 2వేల ఇండ్ల వరకు ధ్వంసమైనట్లు అక్కడి మీడియా ప్రకటించింది.
ఉత్తర కొరియాలో ‘షూట్-టు-కిల్’ ఆర్డర్‌తో కరోనా కట్టడి!
RELATED ARTICLES