సియోల్ః ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బతికే ఉన్నాడంటూ అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సాక్ష్యంగా కిమ్ సమావేశమైన ఒక ఫోటోను సైతం విడుదల చేసింది. గత కొంతకాలంగా కిమ్ చనిపోయారంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కిమ్ కోమాలోకి పోయాడని.. అతని చెల్లెలు పరిపాలన బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. దాంతో అక్కడి ప్రభుత్వం స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ కిమ్ చనిపోయారంటూ వార్తలు వచ్చినప్పుడు ఇలాగే కిమ్ పాల్గొన్న ఒక ప్రోగ్రామ్ వీడియోను రిలీజ్ చేసింది. అయితే ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రకటనలో నిజం ఎంతుందన్నది ప్రశ్నార్థకమే.