మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల విడాకుల విషయంలో కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు అంత గొప్పగా పెళ్లి చేసుకొని అప్పుడే విడాకులు ఎందుకు తీసుకుంది అంటూ నెటిజన్లు దీనిని హాట్ టాపిక్‌గా డిస్కషన్ పెట్టారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. తన పెళ్లి గురించి, విడాకుల గురించి ఆసక్తికర స్టేట్‌మెంట్స్ చేసింది. అసలు విడాకులు ఎందుకు తీసుకుందో ఆ విషయం మాత్రం బయటపెట్టలేదు కానీ.. దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి మాత్రం చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత తన తండ్రి నాగబాబు తనకు చాలా సపోర్ట్ చేశారని నిహారిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘‘నీకు 60 ఏళ్లు వచ్చేంతవరకు నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు, నీ గురించి ఎవరు ఏమి అనుకున్నా నేను పట్టించుకోను. నువ్వు నాకు దొరికిన వరం’’ అని నాగబాబు చెప్పారని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. తనకు అలాంటి తండ్రి దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో తను రెండో పెళ్లికి వ్యతిరేకం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక నిహారిక.. విడాకుల గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్స్ వైరల్ అవ్వడంతో తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ సైతం ఈ విషయంపై స్పందించారు. ఒకరు చెప్పిన మాటలు విని.. మరొకరిది తప్పు అని డిసైడ్ చేయకూడదు అని, ఇలాంటి ఇంటర్వ్యూలు చేయాలనుకుంటే ఇద్దరినీ కలిపి ప్రశ్నించాలని సలహా ఇచ్చాడు.