అర్హత ఉండి జీరో విద్యుత్ బిల్ రాని వారు తమ కరెంట్ బిల్, ఆధార్ కార్డు జిరాక్స్, ప్రజా పాలన దరఖాస్తు నంబర్, రేషన్ కార్డుతో ఎంపీడీఓ ఆఫీసును సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో వివరాలను నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. వివరాల నమోదు తర్వాత అధికారులు అందించే రసీదును విద్యుత్ సిబ్బందికి అందించి జీరో బిల్ ను పొందాలని వివరిస్తున్నారు. ఇలా చేసిన వారికి ఈ నెల నుండి బిల్ జీరో అవుతుందని స్పష్టం చేస్తున్నారు.