Homeహైదరాబాద్latest Newsవారిని మభ్య పెట్టడానికి సిగ్గేయడం లేదు..! చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్

వారిని మభ్య పెట్టడానికి సిగ్గేయడం లేదు..! చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్‌ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్‌ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది అని వైఎస్ జగన్ అన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ, అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్‌ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబుగారు మాత్రమే ఇలాంటివి మోసాలు చేయగలరు అని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేసి, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్ధికభారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రులకు ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడంలేదా? అని జగన్ మండిపడ్డారు. విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? అని జగన్ ప్రశ్నించారు. ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు అని అన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యాదీవెన ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈరోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్‌ రాజకీయం కాదా? అని జగన్ ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img