బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం కాదని, ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమణలు తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేస్తారా? ఆక్రమణల తొలగింపునకు హరీశ్‌రావు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? అని ఛాలెంజ్ చేశారు. చెరువులను ఆక్రమించిన వారు ఎంతటివారైనా తొలగించాల్సిందేనని, ఆక్రమణల తొలగింపునకు విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.