హైకోర్టు మరోసారి హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పేదల ఇళ్లే కాకుండా పెద్దల నిర్మాణాలను కూడా కూల్చాలని ఆదేశించింది. ఆక్రమణలకు పాల్పడిన పెద్దల భవనాలను కూల్చినప్పుడే భూములకు రక్షణ ఉంటుందని తెలిపింది. అయితే తాజాగా మీరాలం ట్యాంక్ పరిసరాల్లో ఉన్న ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. దీంతో నోటీసులను సవాల్ చేస్తూ ఇళ్ల యజమానులు పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు జస్టీస్ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు.