Homeహైదరాబాద్latest Newsమీ దగ్గర ఉన్న రూ.10 నాణేలు దుకాణాల్లో తీసుకోవడం లేదా?.. ఎస్‌బీఐ కీలక ప్రకటన

మీ దగ్గర ఉన్న రూ.10 నాణేలు దుకాణాల్లో తీసుకోవడం లేదా?.. ఎస్‌బీఐ కీలక ప్రకటన

దాదాపు ప్రతి ఒక్కరూ పది రూపాయల నాణేలను ఉంచుకుంటారు. ఎందుకంటే వ్యాపారులు ఈ రూ.10 నాణేలను దుకాణాల్లో తీసుకోవడం లేదు. దీనివల్ల సామాన్యులకు చేసేదేమీ లేక తమ వద్దే ఉంచుకుంటున్నారు. అందుకే చాలా మంది దగ్గర ఈ రూ.10 నాణేలు ఉంటాయి. అయితే మీ దగ్గర కూడా రూ.10 నాణేలు ఉంటే మాత్రం మంచి విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా కొనసాగుతున్న ఎస్‌బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. రూ.10 నాణేలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
రూ.10 నాణేలపై చాలా మందికి సందేహాలు ఉండవచ్చు. వ్యాపారులు, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) అధికారులు శనివారం వ్యాపారులకు, ప్రజలకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ఎస్ బీఐ బ్యాంకు జోనల్ కార్యాలయంలో రూ.10 నాణేల స్వీకరణపై అవగాహన ప్రచారం నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమన్వయంతో దేశీ సెంట్రల్ బ్యాంక్ దీన్ని చేసింది. వ్యాపారులకు రూ.10 నాణేలను అందించారు.వ్యాపారులు, చిరు వ్యాపారులు, ప్రజలు రూ.10 నాణేలను తీసుకోవడానికి విముఖత చూపుతున్నారని ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ ప్రకాశ్ చంద్ర బరోర్ తెలిపారు. ఆర్‌బీఐ చలామణిలో ఉన్న రూ.10 నాణేలు చట్టబద్ధమైనవని, వీటిని అన్ని లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

Recent

- Advertisment -spot_img