Homeహైదరాబాద్latest Newsప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు.. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : హరీష్ రావు

ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు.. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : హరీష్ రావు

బిఆర్ఎస్ నాయకులు అరెస్టులుపై హరీష్ రావు స్పందించారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు ZPHS పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారితో పాటు, బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీష్ రావు అన్నారు. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం?.. పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా?.. అని ప్రశ్నించారు. విద్యార్దులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అని హరీష్ రావు నిలదీశారు. అప్రాజ్యస్వామిక విధానాలు విడనాడాలని, అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బిఆర్ఎస్ నాయకులకు వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేసారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అని హరీష్ రావు తెలిపారు.

Recent

- Advertisment -spot_img