సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో నోటాకు లక్ష తొంబై వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్‌వానీ 10,76,666 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,91,317) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 45,396 ఓట్లతో నిలిచారు. కాగా.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకుని బీజేపీలో చేరారు.