భారతీయ రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 32వేల గ్రూప్-D పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలతో 18 నుంచి 33 ఏళ్ల వయసున్న వారు అర్హులు. SC, STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.