ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 100 సీట్ల కోసం మరియు 7,8,9,10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సుంకరి రవి ఒక ప్రకటనలో తెలిపారు…. ఆన్లైన్ దరఖాస్తులు 06/1/ 2025 నుండి 28/02/2025 వరకు స్వీకరించడం జరుగుతుంది.అందుకు గాను SC,ST, BC, PHC మరియు EWS విద్యార్థులు125 రూపాయలు,OC విద్యార్థులు 200 ఆన్లైన్లో ఫీ చెల్లించాల్సి ఉంటుంది.
03/04/2025 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 13/4/2025 రోజున ఉదయం 10 నుంచి12 గంటలు వరకు 6వ తరగతి విద్యార్థులకు 7,8,9,10 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలు వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
http://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లో సంప్రదించగలరు.పూర్తి వివరాలకు 9550590300 తో సంప్రదించగలరు.