TCS recruitment: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది. 2024లో బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్ పూర్తి చేసిన వారు అర్హులు. దరఖాస్తు చేయడానికి చివరితేది ఏప్రిల్ 10. రిక్రూట్మెంట్ కు సంబంధించి పరీక్ష ఏప్రిల్ 26న జరుగుతుందని కంపెనీ వెబ్ సైట్ కెరీర్ పేజీలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tcs.com/careers సైట్‌ను సంప్రదించగలరు. గత సంవత్సరం నుంచి ఫ్రెషర్స్‌కు ఐటీ నియామకాలు మందగించాయి. ఈ టైంలో నోటిఫికేషన్ రావడంతో..ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలు మెరుగుపడనున్నాయి.