ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎంజీఈఎల్, ఎన్ఆర్ఈడీసీఏపీ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ అంగీకారం కుదిరింది. రాష్ట్రంలో ఎన్టీపీసీ రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి 25 ఏళ్లలో రూ.20,620 కోట్ల ఆదాయం వస్తుంది. 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.