NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన సినిమా ”దేవర”. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా ”దేవర 2” కూడా రాబోతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ”వార్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ మరో రెండు నెలల్లో పూర్తి కాబోతుంది. ఎన్టీఆర్ ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తాడు. ఈ క్రమంలోనే ”దేవర 2” సినిమా షూటింగ్ కూడా ఒకేసారి చేయాలి అని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కొరటాల శివ కూడా సినిమాకి సంబందించిన పనులు ఇప్పటికే ప్రారంభించాడు. ”దేవర 2” సినిమా షూటింగ్ కోసం కోసం ఉత్తర కన్నడలోని కుంటాలో భారీ సెట్లు నిర్మిస్తున్నారు. అక్కడే కీలకమైన సన్నివేశాలను డైరెక్టర్ చిత్రకరించబోతునట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో ఎన్టీఆర్ జూన్ లో అడుగుపెట్టనున్నారు అని తెలుస్తుంది.