Homeహైదరాబాద్latest NewsNTR : బాలకృష్ణ బర్త్‌డే ఎన్టీఆర్ మర్చిపోయాడా..? లేదా కావాలనే చెప్పలేదా..?

NTR : బాలకృష్ణ బర్త్‌డే ఎన్టీఆర్ మర్చిపోయాడా..? లేదా కావాలనే చెప్పలేదా..?

NTR : నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యణ్, కళ్యాణ్ రామ్, రాజకీయ నాయకులు, అభిమానులు బాలకృష్ణకు బర్త్‌డే విషెష్ చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ అనేక సందర్భాలలో బాలకృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్వీట్ చేసి అభినందనలు తెలిపారు. కానీ ఈ సారి పుట్టినరోజు విషెస్ చెప్పకపోవడంతో, “ఎన్టీఆర్ కావాలనే విష్ చెప్పలేదా? లేక మర్చిపోయారా?” అనే ప్రశ్నలు అభిమానుల మధ్య తలెత్తాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది.

గత కొంత కాలంగా బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య సంబంధాలలో గ్యాప్ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. నందమూరి కుటుంబంలో ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య మాటలు తగ్గినప్పటికీ, ఎన్టీఆర్ సాధారణంగా బాలకృష్ణకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సోషల్ మీడియాలో కొందరు కావాలనే విషెస్ లేదు.. ఇద్దరి మధ్య గొడవలు స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ మరియు ప్రశాంత్ నీల్‌తో ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందిస్తారా లేక ఈ చర్చలు ఇలాగే కొనసాగుతాయా అనేది చూడాలి.

Recent

- Advertisment -spot_img