NTR : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ”డ్రాగన్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా షూటింగ్ ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ లో కొన్ని కీలక సీన్స్ ను నీల్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 22న ప్రారంభంకానుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటాడని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.