Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. ‘దేవర పార్ట్ 2' మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. ‘దేవర పార్ట్ 2′ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..!

తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ‘దేవర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే తాజాగా ‘దేవర పార్ట్ 2’ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ బృందం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్న ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ‘వార్’ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. దాని తరువాత ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు ‘దేవర పార్ట్ 2′ సినిమా షూటింగ్ లో ఏకకాలంలో పాల్గొనేలా ఎన్టీఆర్ ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే మరోవైపు కొరటాల శివ ‘దేవర 2’ పై ఆసక్తికర వ్యాక్యాలు చేసాడు. ఈ సినిమా మరింత పెద్దదిగా ఉండబోతోందని.. పైగా ఈ సినిమాల్లో టాప్ సెలబ్రిటీలు నటించే స్కోప్ ఉందని వెల్లడించారు. వీరిలో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు నటించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img