Homeఫ్లాష్ ఫ్లాష్కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్.. ఆ సినిమా రికార్డు టార్గెట్ గా దూసుకుపోతున్న 'దేవర' మూవీ..!

కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఎన్టీఆర్.. ఆ సినిమా రికార్డు టార్గెట్ గా దూసుకుపోతున్న ‘దేవర’ మూవీ..!

తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ‘దేవర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 466 కోట్ల రూపాయల మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్‌ను వసూలు చేసింది. తాజాగా 11 రోజుల్లో రూ.2.66 కోట్ల గ్రాస్ అందుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆల్‌టైం టాప్ 4 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సెంటర్ లో RRR రూ.5.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో నంబర్ వన్ ప్లేస్ లో ఉండగా, బాహుబలి 2 (రూ.3.76 కోట్లు), కల్కి రూ.3.61 కోట్లు, దేవర రూ. 2.66 కోట్లు (11 రోజుల్లో) మరియు రంగస్థలం రూ.2.42 కోట్లు రాబట్టింది. తాజాగా ఎన్టీఆర్ మరో రికార్డును నెలకొల్పాడు. టాలీవుడ్ ఎపిక్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన బాహుబలి 1 తెలుగు వెర్షన్ కలెక్షన్లను టార్గెట్ చేసాడు. తెలుగు వెర్షన్ లో వరల్డ్ వైడ్ గా రూ.188 కోట్ల షేర్ అందుకున్న దేవర.. మరో రూ.6 కోట్లు సాధిస్తే బాహుబలి 1 రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. బాహుబలి 1 తెలుగు వెర్షన్ రూ.194 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కలెక్షన్ల పరంగానూ దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img