Homeహైదరాబాద్latest NewsVIRAL: ఎన్టీఆర్‌ నాకు తమ్ముడితో సమానం.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

VIRAL: ఎన్టీఆర్‌ నాకు తమ్ముడితో సమానం.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్‌పై దర్శకుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘ఎన్టీఆర్‌ నాకు తమ్ముడితో సమానం. మిత్రుడు కాదు’’ అని అన్నారు. ఎన్టీఆర్‌ ను యంగ్‌ టైగర్‌ గా చేసింది రాజమౌళి అయితే.. రాజమౌళి స్టార్‌ దర్శకుడిగా మారడంలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా కాస్త అటు ఇటుగా ఒకేసారి కెరీర్ ను ఆరంభించారు. ఇద్దరూ కలిసి చేసిన ప్రాజెక్ట్‌ లు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. అందుకే ఇద్దరూ మంచి మిత్రులు అని అంతా అనుకుంటారు. రాజమౌళి తాజాగా ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళిని యాంకర్ ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్‌ ఎవరు అంటూ ప్రశ్నించగా వెనుక నుంచి చాలా మంది తారక్‌ అంటూ మొత్తుకున్నారు. అప్పుడు రాజమౌళి స్పందిస్తూ ఎన్టీఆర్‌ నాకు మిత్రుడు కంటే తమ్ముడులాగా అన్నాడు.

Recent

- Advertisment -spot_img