NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ”వార్ 2” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో గ్రాండ్ ఇంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే మరో వైపు ఎన్టీఆర్ తన తదుపరి సినిమాపై కసరత్తు మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కోసం చాలా డైరెక్టర్లు పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు కన్ఫర్మ్ అయింది. నెల్సన్ ”జైలర్” హిట్టుతో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో నెల్సన్ ఎన్టీఆర్ కు ఒక భారీ యాక్షన్ స్టోరీ చెప్పాడని.. ఆ స్టోరీకి ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పాడు అని సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి ”రాక్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
అయితే ఎన్టీఆర్ ఎక్కువగా కధ బలం సినిమాలు చేస్తాడు. కానీ నెల్సన్ దానికి పూర్తి బిన్నం.. స్టోరీ లేకపోయినా తన అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు. అయితే గతంలో నెల్సన్ తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో కలిసి ”బీస్ట్” అనే సినిమా చేసాడు. అయితే ఆ సినిమా అనుకుంతా స్థాయిలో ఆడలేదు కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. అయితే నెల్సన్ ఎన్టీఆర్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నెల్సన్ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆక్షన్ సీన్స్ కూడా బాగానే తీస్తాడు. కానీ ఎన్టీఆర్ లాంటి స్టార్ తో నెల్సన్ ఎలాంటి జోనర్ లో సినిమా తీస్తాడు అని ఆసక్తి నెలకొంది.