Homeహైదరాబాద్latest NewsNTR : తమిళ డైరెక్టర్‌తో మూవీ.. హింట్ ఇచ్చిన ఎన్టీఆర్

NTR : తమిళ డైరెక్టర్‌తో మూవీ.. హింట్ ఇచ్చిన ఎన్టీఆర్

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ”దేవర” సినిమాతో భారీ హిట్టు కొట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ”వార్”, ”డ్రాగన్” సినిమాల షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రముఖ ప్రొడ్యూసర్ నాగ‌వంశీ నిర్మించిన ”మ్యాడ్” సూపర్ హిట్టు కావడంతో.. శుక్ర‌వారం స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన నెక్స్ట్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. నాగ వంశీ నిర్మాతగా తాను ఒక సినిమాలో నటించబోతున్నాను. ఇది చాలా పెద్ద సినిమా అని ఎన్టీఆర్ చెప్పారు. గతంలో ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని వార్తలు వచ్చాయి. అయితే నాగ వంశి కూడా ఒక ఇంటర్వ్యూ లో నెల్సన్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని చెప్పారు. తాజాగా ఎన్టీఆర్ కూడా నాగవంశీ తో సినిమా చేస్తున్నాను హింట్ ఇవ్వడంతో ఆ వార్త నిజమే అని అందరూ అంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ 0 నెల్సన్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.ntr nelson ఇదేనిజం NTR : తమిళ డైరెక్టర్‌తో మూవీ.. హింట్ ఇచ్చిన ఎన్టీఆర్

Recent

- Advertisment -spot_img