Homeహైదరాబాద్latest NewsNTR - Neel : సముద్రంలో ఎన్టీఆర్ - నీల్.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేందుకు సిద్ధం..!!

NTR – Neel : సముద్రంలో ఎన్టీఆర్ – నీల్.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేందుకు సిద్ధం..!!

NTR – Neel : ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ”డ్రాగన్” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై అందరి దృష్టి ఉంది.ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 22న ప్రారంభంకానుంది. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. హైప్‌ను రేకెత్తించడానికి, మేకర్స్ సముద్రం ఒడ్డున నిల్చుని ఉన్న ఎన్టీఆర్ – నీల్ ఫోటోను విడుదల చేశారు. రేపటి నుంచి కర్ణాటకలో షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఫొటోలో ఎన్టీఆర్ గొడుగు పట్టుకుని, కూలింగ్ గ్లాసెస్ ధరించి, ప్రశాంత్ నీల్ టోపీ ధరించి కనిపిస్తున్నారు. ఈ ఫోటో చుసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేందుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా 2026 జనవరి 9న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img