NTR : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) ”డ్రాగన్” అనే సినిమా చేస్తున్నాడు. నేడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో 2,000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గన్నారు. రాబోయే షెడ్యూల్‌లో ఎన్టీఆర్ షూటింగ్‌లో చేరనున్నారు. ఈ సినిమా జనవరి 9, 2026న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ విజయాలకు పేరుగాంచిన ప్రశాంత్ నీల్ మునుపెన్నడూ చూడని ఎన్టీఆర్‌ను ఒక కొత్త తరహాలో చూపించనున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.