Homeహైదరాబాద్latest NewsNTR : జపాన్‌లో నాగ చైత్తన్యాను పొగిడిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

NTR : జపాన్‌లో నాగ చైత్తన్యాను పొగిడిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ”దేవర”. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఎన్టీఆర్ కు జపాన్ లో ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండడంత ఈ సినిమాను జపాన్ లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్‌లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్‌లో ఒక ఇంటర్వ్యూ లో నాగ చైత్తన్యాను ఎన్టీఆర్ పొగిడారు.

జపాన్‌ ఫుడ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నా స్నేహితుడు హైదరాబాద్ లో షోవు అనే రెస్టారెంట్ నడుపుతున్నాడు. నా స్నేహితుడు నాగ చైతన్య కూడా హీరోనే. ఆ రెస్టారెంట్ లో స్వచ్ఛమైన జపనీస్ ఫుడ్ దొరుకుతుంది. నాకు ముఖ్యంగా సుషీ అంటే ఇష్టం. షోయులో అత్యుత్తమ సుషీ మరియు జపనీస్ ఆహారాలు ఉన్నాయి. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img