Homeహైదరాబాద్latest NewsNTR : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ.. ఫస్ట్ లుక్ రివీల్‌కి డేట్ ఫిక్స్..!!

NTR : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ.. ఫస్ట్ లుక్ రివీల్‌కి డేట్ ఫిక్స్..!!

NTR : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ”డ్రాగన్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా షూటింగ్ ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ లో కొన్ని కీలక సీన్స్ ను నీల్ తెరకెక్కించారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 22న ప్రారంభంకానుంది. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రబృందం రిలీజ్ చేయబోతుంది. మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నారు అని సమాచారం.ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా జనవరి 9, 2026న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img