NTR : శివ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన సినిమా ”దేవర”. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు జపాన్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. దీంతో ”దేవర” సినిమాని జపాన్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని మార్చి 28న జపాన్ లో విడుదల చేయనున్నారు.జపాన్‌లో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా జపాన్ మీడియాకు ఎన్టీఆర్ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మార్చి 22న దేవర సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లనున్నారు.