Homeహైదరాబాద్latest NewsNTR : ఎన్టీఆర్ ''డ్రాగన్'' మూవీ.. ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేం.. ఆ సినిమాకి స్కై...

NTR : ఎన్టీఆర్ ”డ్రాగన్” మూవీ.. ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేం.. ఆ సినిమాకి స్కై లిమిట్

NTR : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) ”డ్రాగన్” అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలు నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మైత్రి నిర్మాత రవి శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ నీల్ సినిమా భారతీయ తెరపై ఇంతవరకు చూడని కథ అని చెప్పారు. ఈ సినిమా కథకు స్కై లిమిట్.. మాకు చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేం.. కానీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తుంది అని తెలిపారు. ఈ వార్త విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జనవరి 9, 2026న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img