NTR : జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ కు తిరులేని నటుడు అనే పేరు కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ గురించి గతంలో కొన్ని రుమౌర్స్ వచ్చాయి. ఒక్కపుడు ఎన్టీఆర్ ఒక హీరోయిన్ తో పీకలోతుల్లో ప్రేమలో ఉన్నాడు అని వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమీరా రెడ్డి.. ఎన్టీఆర్ – సమీరా రెడ్డి కలిసి ”అశోక్”, ”నరసింహుడు” అనే సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని.. ఒకనొక టైంలో ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు అని సమాచారం. అయితే ఈ విషయం నందమూరి ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడంతో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ కు సర్ది చెప్పాడు అని అన్నారు. మరోవైపు సమీరా రెడ్డికి బాలయ్య గట్టి వార్నింగ్ ఇచ్చారు అని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సమీరా రెడ్డి అప్పటినుంచి సినిమాలు చేయడం మానేసింది. ఆమెకు అట్టు తెలుగులోను, తమిళంలోను సినిమా అవకాశాలు లేక ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రణీతిని పెళ్ళి చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ నటించిన ”వార్ 2” సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది.