ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.