Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ vs బాలకృష్ణ.. మరోసారి టాక్ షో వేదికగా బయటపడ్డా విబేధాలు

ఎన్టీఆర్ vs బాలకృష్ణ.. మరోసారి టాక్ షో వేదికగా బయటపడ్డా విబేధాలు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. ఈ టాక్ షో తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, థమన్ అన్‌స్టాపబుల్ షోకి గెస్టులుగా వచ్చారు. అయితే ఈ షోలో బాలకృష్ణ డైరెక్టర్ బాబీకి సెగ్మెంట్ పెడతాడు. డైరెక్టర్ బాబీ పనిచేసిన హీరోలు గురించి చెప్పమని బాలకృష్ణ అడుగుతాడు. అయితే బాబీ ఎన్టీఆర్ తో ”జై లవ కుశ” అనే సినిమా చేసాడు. ఈ సెగ్మెంట్ లో బాలకృష్ణ బాబీ డైరెక్ట్ చేసిన అందరి హీరోలు గురించి అడిగాడు.. కానీ ఒక ఎన్టీఆర్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఎన్టీఆర్ పేరు పలకడానికి, అతడి సినిమాల గురించి చర్చించడానికి అంత ఇష్టం లేనప్పుడు, అసలు ఆ సెగ్మెంట్ పెట్టడం ఎందుకని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య విబేధాలు ఉన్నాయని సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో మరోసారి ఆ వివాదం బయటపడింది.da 1 ఇదేనిజం ఎన్టీఆర్ vs బాలకృష్ణ.. మరోసారి టాక్ షో వేదికగా బయటపడ్డా విబేధాలు
.

Recent

- Advertisment -spot_img