NTR : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి ”వార్ 2” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ ఆపేసారు, అసలు వార్ 2ను రిజెక్ట్ చేసారు అని వార్తలు వస్తున్నాయి. అయితే అసలు నిజం ఏంటిఅంటే.. సినిమాని రిజెక్ట్ చేసింది ఎన్టీఆర్ కాదు ఎన్టీఆర్ బాడీ డబుల్ అవును.. ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ బాడీ డబుల్‌గా ఒక వ్యక్తిని చిత్రబృందం సంప్రదించింది కానీ ఆ ఆఫర్ ను అతను రిజెక్ట్ చేసాడు.
ఈశ్వర్ హ్యారిస్ అనే వ్యక్తి ఎన్టీఆర్ బాడీ డబుల్ గా ”ఆర్ఆర్ఆర్” సినిమాలో చేసాడు. ఇటీవలే ఈశ్వర్ హ్యారిస్ ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ బాడీ డబుల్‌గా పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేసాడు అని చెప్పాడు. ఈశ్వర్ హ్యారిస్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ”వార్ 2” సినిమా కోసం తనను సంప్రదించారని, కానీ ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణ ఖర్చులను కూడా కవర్ చేయలేదని తెలిపారు. మూడు రోజుల షూట్ కోసం ఆఫర్ చేసిన మొత్తం చాలా తక్కువగా ఉందని, బాలీవుడ్‌లో పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నప్పటికీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఎక్కువ రెమ్యూనరేషన్ లభిస్తుందని ఆయన తెలిపాడు. తాను హీరోకి బాడీ డబుల్‌గా చేయడానికి ఆ సినిమాను బట్టి లక్షల్లో పారితోషికం నిర్మాతలు ఇస్తారు అని చెప్పాడు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.